Samantha: పెళ్లి తర్వాత ఆ విషయంలో మారిన సమంత..?

  • April 22, 2021 / 05:33 PM IST

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత గడిచిన మూడేళ్ల నుంచి తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు. ఏ మాయ చేశావె మూవీలో చైతన్యకు జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. 2017 సంవత్సరంలో నాగచైతన్య సమంతల వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత సమంత స్పీడ్ తగ్గించారనే చెప్పాలి. పెళ్లి తర్వాత చరణ్ తో కలిసి సమంత నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ అనే సంగతి తెలిసిందే.

అయితే రంగస్థలం హిట్టైనా స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాల్లో సమంతను హీరోయిన్ గా తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పెళ్లి తర్వాత గ్లామరస్ రోల్స్ కు దూరమైన సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. రుద్రమదేవి సినిమా తరువాత గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం.

అయితే సమంతకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా పేరు తెచ్చిపెట్టే సినిమాలనే ఎంపిక చేసుకోవాలని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ కారణం వల్లే సమంత సినిమాలు తగ్గించారని సమాచారం. ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించకపోకపోయినా యాడ్స్, బిజినెస్ ల ద్వారా సమంతకు బాగానే ఆదాయం చేకూరుతోందని తెలుస్తోంది. 2022 సంవత్సరంలో శాకుంతలం మూవీ రిలీజ్ కానుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus