Samantha,Allu Arha: అల్లు అర్హపై సమంత షాకింగ్ కామెంట్స్!

  • October 21, 2021 / 04:09 PM IST

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా రిలీజ్ కోసం సమంత ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ భరతుని పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే. సినిమాలో అల్లు అర్హ కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ప్రేక్షకులతో విజిల్స్ వేయించేంత అద్భుతంగా అర్హ ఆ పాత్రను పోషించారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్హ పుట్టడమే రాక్ స్టార్ గా పుట్టిందని సమంత తెలిపారు.

అల్లు అర్హ గురించి తాను ఏమని చెప్పినా ఆ కామెంట్లు తక్కువే అవుతాయని సమంత పేర్కొన్నారు. సెట్ లో 200 మంది, 300 మంది ఉన్నా అల్లు అర్హ చాలా కాన్ఫిడెన్స్ తో ఉందని సమంత తెలిపారు. అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించి తొలి ప్రయాణంలోనే మంచి నిర్ణయం తీసుకుందని అల్లు అర్హ తెలుగు బాగా మాట్లాడుతుందని సమంత పేర్కొన్నారు. అల్లు అర్హ పుట్టడమే సూపర్ స్టార్ గా పుట్టిందంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు.

అల్లు అర్హ ఈ పరిశ్రమను ఏలబోతుంటూ అర్హ భవిష్యత్తు గురించి సమంత చెప్పుకొచ్చారు. శాకుంతలం సినిమాను చూసిన తర్వాత అందరూ తను చెప్పిన మాటతో ఏకీభవిస్తారని సమంత పేర్కొన్నారు. సౌత్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా తాను చేయలేదని అయితే ఇకపై మాత్రం తాను బాలీవుడ్ సినిమాలలో కూడా చేస్తానని సమంత వెల్లడించారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus