నటీనటులు తాము నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే కొంత ఆందోళనగా ఉంటారు. అదే ఒకే సారి మూడు సియమాలు రిలీజ్ అవుతుంటే.. ఆ టెన్షన్ ట్రిపుల్ అవుతుంది. ఆ సినిమాలా ఫలితం ఎలా వుండబోతుందోనని కంగారు పడుతారు. సమంత మాత్రం ఇందుకు విరుద్ధంగా.. ఆనందంగా ఉన్నారు. సమంత తమిళంలో విశాల్ పక్కన “ఇరుంబు తిరై” సినిమాలో నటించింది. దీనిని తెలుగులో “అభిమన్యుడు”గా అనువదించారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంత్రి కే రిలీజ్ కావాలి. కానీ ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ పోస్ట్ పోన్ చేశారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని విశాల్ ప్రకటించారు. ఈ మూవీని మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే రోజున సమంత జమునగా నటించిన సావిత్రి బయోపిక్ “మహానటి” కూడా విడుదల కానుంది. ఇది కూడా రెండు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో తొలిసారి సమంత నటించిన “రంగస్థలం” మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సమంత నటిస్తోన్న మూడు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో అలరించబోతున్నాయి. ఈ మూడు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సమంత ధీమాగా ఉన్నారు.