Samantha: అఖిల్ అక్కినేని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ వీడియో చూసి సమంత ఏమందంటే..

  • March 1, 2023 / 03:26 PM IST

అఖిల్ అక్కినేని – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏజెంట్’.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సరికొత్త మేకోవర్‌తో హాలీవుడ్ హీరోలా మారిపోయాడు అఖిల్.. నో డౌట్.. పక్కా హిట్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు టీమ్.. సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతుండగా.. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. డిఫరెంట్ కథ, కథనాలతో అఖిల్‌ లాంటి హ్యాండ్సమ్ హంక్‌ని మాస్ అండ్ యాక్షన్ హీరోగా చూపించనున్నారు.

క్యారెక్టర్ కోసం కఠినమైన వర్కౌట్స్ చేశాడు అఖిల్.. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ రీసెంట్‌గా ‘ఏజెంట్’ విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ‘ఏజెంట్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పేరుతో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.‘‘పేరు ఏంటో చెప్పు.. పోలీసా?, రా నా?.. ఏదైనా ఏజెన్సీనా?.. ఈ నెట్ వర్క్‌లోకి నిన్నెవడు పంపాడ్రా?’’.. అంటే అఖిల్.. ‘‘ఒసామా బిన్ లాడెన్.. గాదాఫీ.. హిట్లర్ పంపాడు బే’’.. అని చెప్పడం..

‘‘బోల్, సాలే’’.. అనగా.. ‘‘సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్’’ అంటూ బిగ్గరగా చెప్పడం.. ముఖమంతా రక్తంతో ఉన్న అఖిల్‌ని రివీల్ చేయడం అలరించేలా అనిపిస్తోంది. ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అఖిల్ హిట్ కొట్టబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వీడియో చివర్లో విడుదల తేదీ ప్రకటించారు. ఏప్రిల్ 28న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

 

అఖిల్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇదే. ఇక ఈ అక్కినేని హీరో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. మాజీ వదిన సమంత స్పందించింది. అఖిల్ ‘ఏజెంట్’ పోస్టుకి సమంత లైక్ కొట్టింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus