Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

టాలీవుడ్‌లో మరో ఇబ్బంది మొదలవ్వబోతోందా? సమ్మర్‌, పోస్ట్‌ సమ్మర్‌ సీజన్‌లో సినిమాలు రిలీజ్‌ చేద్దాం అనుకుంటున్న వారికి గుండెల్లో దడ మొదలవుతుందా? టాలీవుడ్‌లో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు సినిమా నిర్మాతలు ఇప్పటికే అంగీకరించిన తీర్మానాల అమలు విషయంలో ఇప్పుడు చర్చ మొదలైంది. అదే సమ్మెకు దారి తీస్తోంది అని సమాచారం. యూనియన్లు, ప్రభుత్వం, నిర్మాతల మధ్య గతంలోనే చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో కార్మికుల వేతనాల పెంపు, కాల్షీట్లు తదితర అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు.

Tollywood

తీర్మానాల అమలు విషయంలో ఆ సమయంలో ప్రభుత్వం వైపు నుండి ఓ కమిటీ ఏర్పాటైంది. అయినా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల్ని ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని టాలీవుడ్‌కి చెందిన కొన్ని యూనియన్లు.. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడికి లేఖలు రాశాయి. తొలుత అనుకున్న గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 1 నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయని సమాచారం.

ఫెడరేషన్‌ అధ్యక్షుడికి లేఖ రాసిన యూనియన్లలో తెలుగు సినీ స్టుడియోస్ వర్కర్స్ యూనియన్, ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్స్ యూనియన్లు ఉన్నాయని తెలుస్తోంది. తమ నిరసన వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లితే తాము బాధ్యత వహించం అంటూ లేఖలో పేర్కొన్నారని భోగట్టా. ఆ రెండు సంఘాలే కాకుండా మరికొన్ని యూనియన్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయని చెబుతున్నారు. వారంతా కలిసి వచ్చే నెల 1 నుండి సమ్మె చేయాలనే అనుకుంటున్నారట. అదే జరిగితే ఆ ప్రభావం సమ్మర్ సినిమాలపై పడుతుంది.

కొన్ని నెలల క్రితం ఇలాగే జరిగిన సమ్మెతో నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పక్క రాష్ట్రాల నుండి కార్మికుల్ని తీసుకొచ్చి షూటింగ్స్ చేసుకోవాలని చూశారు. దీంతో గొడవలు జరిగాయి. ఆ తర్వాత పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వ పెద్దల జోక్యంతో కాస్త సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు సమ్మె అంటే మరోసారి ఇబ్బందులు తప్పవు.

అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus