రామ్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అధికారికంగా సినిమాను అనౌన్స్ చేసింది టీమ్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే సినిమాలో హీరోయిన్ ఎవరు అని, ఎందుకంటే ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు చర్చలోకి వస్తున్నా.. ఏదీ ఓకే కావడం లేదు. తాజాగా మరో హీరోయిన్ పేరు చర్చలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈమైనా ఈ సినిమాకు ఓకే చెబుతుందా? చిత్రబృందం ఓకే చేస్తుందా? అనేది చర్చగా మారింది.
రామ్ సినిమాకు హీరోయిన్‌ని వెతకడానికి ఇన్ని రోజులు అవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ ఈ సారి చాలా రోజులు పట్టేస్తోంది. ఈ సినిమాలో రామ్ వీర అనే యువకుడిగా కనిపిస్తాడు. ఆయన పక్కన హీరోయిన్‌గా గ్లామర్ డాల్ కాకుండా కాస్త నేచురల్ లుక్‌లో ఉన్న హీరోయిన్ కావాలని చూస్తున్నారట. దీని కోసం తొలుత శ్రీనిధి శెట్టి పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత కయాదు లోహర్ చర్చలోకి వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు పక్కా అనుకుంటుండగా, ఇప్పుడు సంయుక్త పేరు తెరపైకి వచ్చింది.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబరులో విడుదల చేయాలని అనుకుంటున్నాడు రామ్. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వడం లేదు. దీంతో రామ్ డైరక్టర్‌గా మారాక.. ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, ఓ పట్టాన ఒప్పుకోవడం లేదని ఈ ఎంపిక ప్రాసెస్ చూశాక అర్థమవుతోంది. మరి రామ్ మనసులో ఎలాంటి నాయిక ఉంది అనేది చూడాలి. అటు తిరిగి, ఇటు తిరిగి ఈ సినిమా భాగ్యశ్రీ భోర్సే దగ్గరకు ఏమన్నా వెళ్తుందా అనే డౌటనుమానం కూడా ఉంది.