Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

చేసిన ఐదుకి ఐదు సినిమాల్లో తన కంటూ ప్రత్యేకమై గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ హీరో. ఓటీటీలో కూడా తనంటే ఏంటో ఓ నాలుగు ప్రాజెక్ట్‌లతో చూపించాడు. యువ హీరోల్లో పెక్యూలియర్‌ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ, ప్రమోషనల్‌ స్ట్రాటజీలు ఆ కుర్ర హీరో సొంతం. రీసెంట్‌గా ‘రాకాసా’ సినిమాతో మంచి విజయం అందుకున్న సంగీత్‌ శోభన్‌ గురించే ఇదంతా. ఇప్పుడు ఆయన మరో సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

Sangeeth Sobhan

ఈ కొత్త సినిమాకు సంగీత్‌ను అభిమానించే స్టార్‌ హీరో ప్రభాస్‌కు ఓ లింక్‌ ఉండటం గమనార్హం. ప్రభాస్‌ స్టైలిష్‌ హిట్‌ ‘సాహో’ సినిమాకు డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ప్రణవ్‌ రావు ఈ సినిమాకు దర్శకుడు. సంగీత్‌ శోభన్‌కి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన ‘మ్యాడ్‌’ సినిమాకు కూడా ఈ దర్శకుడితో లింక్‌ ఉంది. అలా తనకు బాగా దగ్గరైన ప్రభాస్‌, నిర్మాత నాగవంశీ కనెక్టివిటీతో ఈ సినిమాను చేస్తున్నాడు సంగీత్‌ శోభన్‌. ఈ సినిమాకు షైన్‌ స్క్రీన్స్‌ సాహ గారపాటి నిర్మాత.

ప్రణవ్‌ రావు ‘సాహో’కి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత ‘మ్యాడ్’ సినిమాలకు కోరైటర్, చీఫ్ ఏడీగా చేశారు. ఆ సమయంలో ఉన్న పరిచయంతోనే సంగీత్‌కి ఈ కథ చెప్పి ఓకే చేసుకున్నారని సమాచారం. ఈ సినిమా గత సినిమాల్లా వినోదాత్మకంగానే ఉంటుంది అని సమాచారం. త్వరలో సినిమాను అనౌన్స్‌ చేసినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తారని సమాచారం. ఇది కాకుండా సంగీత్‌ మరో సినిమాను కూడా ఓకే చేశాడని టాక్‌.

‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus