విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆల్రెడీ ‘రంగస్థలం’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసింది.
ఒకసారి 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 33.56 cr |
సీడెడ్ | 14.85 cr |
ఉత్తరాంధ్ర | 16.88 cr |
ఈస్ట్ | 11.75 cr |
వెస్ట్ | 7.54 cr |
కృష్ణా | 8.26 cr |
గుంటూరు | 9.04 cr |
నెల్లూరు | 3.91 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 105.79 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.2 cr |
ఓవర్సీస్ | 13.51 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 126.5 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 12 రోజుల్లో రూ.126.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.85.5 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. ఆదివారం రోజున కూడా ఈ సినిమా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.