ప్రభాస్ ఎంత మంచోడు అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్ తన స్టార్ క్యాస్ట్ & టీమ్ కి ఇచ్చే విందు భోజనాల గురించి మాత్రమే కాక, అతడు సైలెంట్ గా చేసే దానధర్మాల గురించి కూడా అప్పుడప్పుడు వార్తలొస్తా ఉంటాయి. అయితే.. ప్రభాస్ ఇద్దరు యంగ్ హీరోల విషయంలో చూపించే కృతజ్ఞతాభావం మాత్రం మరెక్కడా చూసి ఉండం.
తనకి బాగా ఇష్టమైన పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి కోసం “ఆది పురుష్” టైంలో “రొమాంటిక్” సినిమాకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు ప్రభాస్. అప్పుడు ప్రభాస్ ఆకాశ్-కేతికలతో మాట్లాడిన విధానం బీభత్సంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి తన ధాతృత్వాన్ని ఘనంగా చాటుకున్నాడు ప్రభాస్. తనకు మొట్టమొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన శోభన్ కొడుకు సంతోష్ 10 ఏళ్ల తర్వాత ఎట్టకేలకి కొట్టిన హిట్ ని ప్రభాస్ పర్సనల్ గా సెలబ్రేట్ చేసుకోవడం చూసి చాలా మంది ముచ్చటపడ్డారు.
ఆ ఇంటర్వ్యూ పుణ్యమా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాకి కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. ముఖ్యంగా సెకండ్ వీక్ కి మంచి బుకింగ్స్ వచ్చాయి. ఆ ఇంటర్వ్యూలో సంతోష్ శోభన్ కాస్త మొహమాటపడుతూ ప్రభాస్ ని నెంబర్ అడగగా.. “నేను ఎవరికీ ఇవ్వను కానీ, సరే నీకు ఇస్తాను, ఇంపార్టెంట్ అయితేనే కాల్ చేయ్” అంటూ ప్రభాస్ అనడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే.. తాను ప్రభాస్ నెంబర్ ని “ప్రభాస్ అన్న విత్ లవ్ సింబల్”తో సేవ్ చేసుకున్నా అని సంతోష్ చెప్పడం ప్రస్తుతం వైరల్ అయ్యింది. అలాగే.. సంతోష్ మాట్లాడుతూ “ప్రభాస్ దాదాపు రెండు గంటల సేపు మాట్లాడారు, సినిమాలోని ప్రతి విషయం గురించి డిస్కస్ చేశారు” అని చెప్పుకొచ్చాడు.