‘బలరామయ్య బరిలోకి దిగితే..’ టైటిల్ బాలయ్య కోసమేనా..?

  • December 5, 2020 / 02:54 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు అంగీకరిస్తూ షాకిస్తున్నారు. యంగ్ హీరోల చేతిలో కూడా లేనన్ని సినిమాలు బాలయ్య చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తరువాత బి.గోపాల్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం బి.గోపాల్ కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. అలానే దర్శకుడు శ్రీవాస్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘డిక్టేటర్’ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలయ్య.. శ్రీవాస్ కి మరో ఛాన్స్ ఇవ్వనున్నారని టాక్.

కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించనున్నారని చెబుతున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు ఇప్పుడు మరో దర్శకుడు లైన్ లోకి వచ్చినట్లు సమాచారం. ‘కందిరీగ’, ‘హైపర్’ అనే సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన తరువాత బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్నాడు సంతోష్ శ్రీనివాస్.

ఇప్పటికే బాలయ్య కోసం ఓ కథను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్యని లాక్ చేసే చేస్తున్నారు. ఈ సినిమా కోసం ‘బలరామయ్య బరిలోకి దిగితే..’ అనే టైటిల్ కూడా చేయించినట్లు సమాచారం. మరి ఈ సినిమాలో నటించడానికి బాలయ్య ఒప్పుకుంటారో లేదో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus