సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ను ఏ క్షణాన మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమాకు వస్తున్న ఆటంకాలు మాత్రం అన్నీఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఒకసారి వాయిదా పడగా 2024 సంక్రాంతికి కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమేనని సమాచారం అందుతోంది. ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే.
పూజా హెగ్డే ఒక భారీ బడ్జెట్ సినిమా నుంచి తప్పుకోవడం కేవలం ఈ సినిమా విషయంలో మాత్రమే జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా గతంలో పూజా హెగ్డే ఏ సినిమా విషయంలో ఈ విధంగా వ్యవహరించలేదని తన పాత్రకు సంబంధించిన నిడివిని తగ్గించడం వల్లే పూజా హెగ్డే ఈ విధంగా చేసి ఉండవచ్చని కొంతమంది పూజా హెగ్డే అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్, స్క్రిప్ట్, షూటింగ్ ఆలస్యం కావడం, ఇతర మార్పుల వల్ల గుంటూరు కారం మేకర్స్ కు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల నష్టమని తెలుస్తోంది. ఈ సినిమా కోసం షూట్ చేసిన ఒక ఫైట్ సీన్ కూడా వేస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగినా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని థమన్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ తర్వాత షెడ్యూళ్లు అయినా అనుకున్న విధంగా జరిగితే బాగుంటుందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకు ఈ విధంగా జరగడం తమను కూడా బాధ పెడుతోందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం షూట్ ఆలస్యం కావడం వల్ల మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లపై ఎఫెక్ట్ పడుతోందని తెలుస్తోంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!