‘సెహ‌రి’ హీరో హీరోయిన్ల లుక్ పోస్ట‌ర్ రిలీజ్‌!

  • December 16, 2020 / 07:41 PM IST

హ‌ర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి హీరో హీరోయిన్లుగా వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘సెహ‌రి’. సంగీత ద‌ర్శ‌కుడు కోటి కీల‌క పాత్ర పోషిస్తున్నఈ చిత్రాన్నిజ్ఞానసాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వంలో అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేయ‌గా, ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

లేటెస్ట్‌గా బుధ‌వారం హీరో హీరోయిన్ల లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్‌లో ఇద్ద‌రి లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. హీరో హ‌ర్ష్ ముఖంలో ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి అత‌డి వైపు న‌వ్వు ముఖంతో చూస్తోంది. పోస్ట‌ర్‌లో గిటార్‌, తోర‌ణాలు, క్రాక‌ర్స్ వెలుగులు లాంటివి క‌నిపిస్తూ, సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రానికి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్త‌యింది. 2021లో ‘సెహ‌రి’ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus