Rajasekhar,Gopichand: సీనియర్ హీరో రిస్క్ తీసుకుంటాడా..?

  • July 18, 2021 / 05:21 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోగా ఆయన మార్కెట్ తగ్గిన సమయంలో విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ అది మాత్రం జరగడం లేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ బోయపాటి ఫైనల్ గా జగపతిబాబునే రంగంలోకి దింపారు.

ఇప్పుడు రాజశేఖర్ ని మరో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకోవాలని సంప్రదింపులు జరుపుతున్నారట. అసలు విషయంలోకి వస్తే.. గోపీచంద్ హీరో దర్శకుడు శ్రీవాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఓ కీలకపాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది విలన్ రోల్ మాత్రం కాదు. సినిమాను మలుపు తిప్పే కీలకపాత్రలో ఆయన కనిపిస్తారట. దీనికోసం రాజశేఖర్ ను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది.

కానీ ‘గరుడ వేగ’ తరువాత రాజశేఖర్ కి హీరోగా అవకాశాలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హీరోగా బిజీ ఉన్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తారో లేదో చూడాలి!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus