Shah Rukh Khan: అప్పుడే మరో సినిమా చేస్తారట… మాట ఎందుకు మారిందబ్బా!

Advertisement

ఒక బ్లాక్‌ బస్టర్‌తో ఊపులోకి వచ్చిన షా రుఖ్‌ ఖాన్‌కు అంతకుమించిన బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ‘జవాన్‌’ సినిమాతో ఈ ఇద్దరూ బాక్సాఫీసు దగ్గర క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అలాంటిలాంటిది కాదు అని చెప్పాలి. రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. షా రుఖ్‌ ఖాన్‌కు తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టింది. దీంతో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా పడాలని ఫ్యాన్స్‌ చాలా రోజులుగా చూస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సినిమా ఉండొచ్చు అనే పుకార్లు వచ్చాయి.

‘జవాన్‌’ సినిమా కాంబినేషన్‌ను మరోసారి తీసుకొచ్చి బాక్సాఫీసు దగ్గర మరో రూ. వెయ్యి కోట్లు కొట్టాలని షా రుఖ్‌ ఖాన్‌ ప్లాన్‌ చేశాడు అని మాట్లాడుకున్నారు. అయితే అట్లీ చెప్పిన మాటల బట్టి చూస్తుంటే ఇప్పట్లో ఈ కాంబినేషన్‌ మళ్లీ కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. షా రుఖ్‌ ఖాన్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పిన అట్లీ… ఆయనతో కలిసి పని చేయాలన్నది తన కల అని కూడా చెప్పారు.

అయితే తనకు ‘జవాన్‌’ సినిమా రూపంలో దేవుడు అవకాశం ఇచ్చాడని, భారతీయ సినీ పరిశ్రమకు మరో రూపమైన ఆయనతో మరోసారి కలసి పని చేయాలని ఉంది. నా జీవితంలో చూసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. షా రుఖ్‌ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అందరూ అలా ఉండేలా చూసుకుంటారు అని చెప్పారు అట్లీ. అందుకే ‘జవాన్‌’ సినిమా కంటే గొప్ప కథ కుదిరితే కచ్చితంగా షా రుఖ్‌ ఖాన్‌తో సినిమా చేస్తా అని అట్లీ చెప్పారు.

దీంతో అట్లీ – షా రుఖ్‌ (Shah Rukh Khan) సినిమాకు కథ సిద్ధమైంది, త్వరలో ‘జవాన్‌ 2’ రావొచ్చు అని వచ్చిన పుకార్లు అలానే ఉండిపోతాయి. మరోవైపు ‘పఠాన్‌ 2’ అయితే షా రుఖ్‌ చేయబోతున్నాడని టాక్‌. త్వరలో అనౌన్స్‌మెంట్‌ అంటున్నారు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus