నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజెక్ట్ చేసిన సినిమాలు రెండే రెండు. ఒకటి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య అనే స్టార్ హీరో పాత్రకి ఉపేంద్రని తీసుకున్నారు. వాస్తవానికి అదే పాత్ర కోసం ముందుగా బాలకృష్ణని సంప్రదించారు. కానీ బాలయ్య ఎందుకో ఆ పాత్రని రిజెక్ట్ చేశారు. అలాగే ‘జైలర్ 2’ సినిమా కోసం కూడా బాలయ్యని సంప్రదించారు. పావుగంట పాత్ర కోసం రూ.20 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారు.
3 రోజులు డేట్స్ ఇస్తే సరిపోతుంది అని కూడా మేకర్స్ బాలయ్యకి ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఎందుకో ఆ పాత్రని కూడా బాలయ్య రిజెక్ట్ చేయడం జరిగింది.’జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్రకి బాలయ్యని తీసుకుంటే బాగుంటుంది అని అప్పట్లో అభిమానులు అభిప్రాయపడ్డారు. అప్పట్లో దర్శకుడు నెల్సన్ కూడా బాలయ్యని ‘జైలర్’ లో తీసుకోవాలని ఆశపడినట్టు మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.
కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదనీ వివరించారు. అవకాశం ఉంటే ‘జైలర్ 2’ కోసం సంప్రదిస్తానని చెప్పారు. చెప్పినట్టే సంప్రదించారు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) ని తీసుకున్నట్టు కొద్దిరోజుల నుండి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు షారూఖ్ ఖాన్ కన్ఫర్మ్ చేసింది లేదు. అయితే కచ్చితంగా షారూఖ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షారూఖ్.. రజినీకి వీరాభిమాని. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో రజినీకాంత్ రిఫరెన్సులు చాలా వాడుకున్నాడు.
అలాగే ‘రా వన్’ సినిమాలో అయితే రజినీకాంత్ అప్పీరెన్స్ కూడా ఉంది. ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించింది.ఈ నేపధ్యంలో రజినీకాంత్ కి ఓ కార్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు ప్రయత్నించాడు షారూఖ్. కానీ ఆ గిఫ్ట్ ను రజినీకాంత్ స్వీకరించలేదు. ఎంధుకంటే ‘రా వన్’ సినిమాలో రజినీ కాంత్ నటించలేదు. గ్రాఫిక్స్ సాయంతో ‘రోబో’లోని చిట్టి పాత్రని వాడుకున్నారు. అందుకే షారూఖ్ గిఫ్ట్ ను రిజెక్ట్ చేశారు.
కాబట్టి… ‘జైలర్ 2’ లో నటించే అవకాశం వస్తే కనుక.. షారూఖ్ ఖాన్ రిజెక్ట్ చేసే అవకాశం లేదు అనే చెప్పాలి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.