Shalini: స్పెషల్‌ సినిమాలో అంతకంటే స్పెషల్‌గా…!

Advertisement

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చలనచిత్రపరిశ్రమను ఏలిన చిన్నారి… కథానాయికగా మారి కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే వేటికవే విభిన్నం. తాజాగా 20 ఏళ్ల తర్వాత మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఆమెనే షాలిని. ఆఖరిగా 2001లో ‘పిరియద వరం వేండుమ్‌’ అనే తమిళ సినిమాలో నటించిన షాలిని… రీఎంట్రీ చాలా స్పెషల్‌గా ఉండనుంది. ఎందుకంటే ఆమె నటిస్తోంది ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నట. భారీ తారాగణంలో మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’.

ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కీర్తి సురేశ్‌, మోహన్‌ బాబు తదితరుల ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో షాలిని నటిస్తోందని సమాచారం. ఈ విషయంలో చిత్రబృందం నుండి కానీ, షాలిని నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే మణిరత్నం అడిగితే… షాలిని తప్పక నటిస్తుందనేది తెలిసిన విషయమే. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిభాగాన్ని 2022లో విడుదల చేస్తారు.

ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పులి బొమ్మ ఉన్న ఆయుధాలు, ‘పీఎస్‌- 1’ అనే లోగోతో ఈ పోస్టర్‌ రూపొందించారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందుతోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus