ఎవరూ ఊహించని సినిమాలు తీయడం, ఇదేంటి ఇలా ఉంది అని పెదవి విరిచే సినిమా ప్రేక్షకులకు షాకింగ్ కమ్ బ్యాక్ ఇచ్చి చూపించడం ప్రముఖ దర్శకుడు శంకర్‌కు (Shankar) వెన్నతో పెట్టిన విద్య. ‘భారతీయుడు 2’ (Indian 2) సినిమా డిజాస్టర్‌తో బ్యాక్స్టెప్లో ఉన్న శంకర్ ‘రా మచ్చా..’ సాంగ్ రియాక్షన్‌తో ఇంకాస్త బ్యాక్స్టెప్లోకి వెళ్లిపోయారు అనిపించింది. పాట బాగున్నా.. ఎక్కడో తేడా కొట్టింది అనే ఫీలింగ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి తోడు సినిమా రిలీజ్ డేట్ విషయంలో పంచాయితీ మరొకటి.
అయితే వీటన్నింటికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి అనుకున్నారో ఏమో.. సినిమా రిలీజ్‌కు ఇంకా 75 రోజులు ఉంది అని చెబుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దానిని తీర్చిదిద్దిన విధానం చూస్తే ‘శంకర్ ఈజ్ బ్యాక్’ అని అనిపించకమానదు. పైన మీరు చూసిన పోస్టర్ అదే. సినిమాలో చరణ్(Ram Charan) కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన కార్యాలయం ముందు కూర్చుని ఉంటే.. ఎదురుగా వందలాది మంది రౌడీలు ఆయుధాలతో ఆయన మీదకు దూసుకొస్తున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.
ఈ పోస్టర్ చూస్తుంటే ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ కచ్చితంగా గుర్తొస్తుంది. అందులో కూడా ఇలానే పోలీసు స్టేషన్ ముందు చరణ్ నిలబడి ఉంటే.. ఎదురుగా వందల సంఖ్యలో ప్రజలు స్వాతంత్ర్య నినాదాలతో దూసుకొస్తుంటారు. ఆ సీన్ సినిమాకే కాదు, చరణ్ కెరీర్‌కే పీక్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లో (Game Changer) కూడా ఇలాంటి సన్నివేశమే ఉంది అని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
అన్నట్లు ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. ఆ రోజునే తమ సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ అనౌన్స్ చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత పర్ఫెక్ట్ డేట్ అనౌన్స్ చేయడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ డేట్ విషయంలో చరణ్ ఫ్యాన్స్ సీరియస్‌గా నమ్మొచ్చు అని అంటున్నారు.