యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస ప్లాపులు వల్ల రేసులో వెనుకబడ్డాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ‘క’ (KA) అనే సినిమా చేశాడు. చింతా వరలక్ష్మి సమర్పణలో ‘శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి (C. H. Gopalakrishna Reddy) ఈ చిత్రాన్ని దాదాపు రూ.22 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సుజీత్, సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అలాగే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే క్లారిటీ కూడా ఇచ్చాయి.
అయితే కథపై పెద్దగా క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ‘క’ కథ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు కథానాయకుడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “అభినయ్ వాసుదేవ్ అనేవాడు ఒక అనాధ. పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే కుతూహలం అతనికి ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తరాల ద్వారా అతనికి కొన్ని ఎమోషన్స్ పరిచయమవుతూ ఉంటాయి. ‘ఒక అమ్మ కొడుకుతో ఇలా మాట్లాడుతుందా, బంధువుల ప్రేమలు ఇలా ఉంటాయా’ అనేది అతనికి తెలిసొస్తుంది.
దీంతో పక్కవాళ్ళ ఉత్తరాలు చదవాలనే క్యూరియాసిటీ అతనికి పెరుగుతుంది. అందువల్ల అతను పోస్ట్ మాన్ అవ్వాలనుకుంటాడు. అలా పోస్ట్ మాన్ అయిన తర్వాత అతను కృష్ణగిరి అనే ఊరికి వెళ్ళాలి అనుకుంటాడు. వెళ్లిన తర్వాత ఏమవుతుంది అనేది మిగిలిన కథ” అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ చెప్పేశానని కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కథ ఎంత తెలిసినా టేకింగ్ అబ్బురపరిచే విధంగా ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.