Shanmukh Jaswanth: షణ్ముఖ్ కొత్త కారు.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  • July 16, 2021 / 11:47 AM IST

షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. యూట్యూబ్ లో షణ్ముఖ్ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయిపోయాడు. ఇక దీప్తి సునయనతో ప్రేమాయణం అతడిని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఎక్కడా నటించడం లేదు. అప్పుడప్పుడు ఒకట్రెండు ఈవెంట్స్ లో కలిసి పాల్గొంటుంటారు.

వీరిద్దరిపై ఎన్ని రూమర్లు వచ్చినా.. దీప్తి సునయన-షణ్ముఖ్ ఎప్పుడూ, ఎక్కడా వీరి రిలేషన్ గురించి మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా షణ్ముఖ్ మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అతడి ఇమేజ్ కాస్త స్థఅమేజ్ అయింది. కొన్ని రోజుల పాటు ఈ విషయంలో షణ్ముఖ్ ని బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆ ఘటనను అందరూ గుర్తు చేస్తున్నారు.

దానికొక కారణం ఉంది. తాజాగా షణ్ముఖ్ కొత్త కారు కొనుక్కున్నాడు. దాదాపు రూ.15 లక్షలు పెట్టి ఈ కారును కొన్నట్లు తెలుస్తోంది. ఇది నేను హాయ్.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై అంటూ తన స్టైల్ లో సెటైర్ వేశాడు. అయితే ఇలా కొత్త కారు కొనడం.. వెనుక నెంబర్ ప్లేట్ ను బ్లర్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చలాన్లు కట్టాల్సి వస్తుందని.. ఇలా బ్లర్ చేస్తున్నావా..? ఈసారైనా మధ్య సేవించకుండా కారు నడుపు.. జాగ్రత్త అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus