ఒక్క రొమాంటిక్ ఫోటోతో హీరోయిన్ గారి ప్రేమ వ్యవహారం బయటపడిందట..!

Advertisement

కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతో సక్సెస్ సాధించినా.. ఆ తర్వాత ఎందుకో రాణించలేరు. అలాంటి వారి లిస్ట్ తీసుకుంటే అందులో కచ్చితంగా సీరత్ కపూర్ ఉంటుందని చెప్పొచ్చు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత ‘టైగర్’ ‘కొలంబస్’ ‘రాజు గారి గది 2 ‘ ‘ఒక్క క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ సినిమాలు బాగానే ఆడాయి.

కానీ ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’ ‘మా వింత గాధ వినుమా’ వంటి చిత్రాలు పెద్దగా అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఎందుకో ఈ అమ్మడు తెలుగులో కూడా సినిమాలు చేసింది లేదు. ఇదే టైంలో హిందీలో పలు సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ఈమె (Seerat Kapoor) ప్రేమలో ఉందట.

అతను మరెవరో కాదు అమన్ ప్రీత్ సింగ్. ఇతను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు. ఇటీవల సీరత్ కపూర్ తో కలిసి అమన్ ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడట. ఆ టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తుంది. న్యూ ఇయర్ రోజున వీరి రొమాంటిక్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆ వార్తలు నిజమే అని అందరూ భావిస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news