Sharwanand: మూడు సంవత్సరాల మేనల్లుడు గురించి కామెంట్స్ చేసిన శర్వానంద్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన ఏ సినిమా అయినా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయింది.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచి విపరీతమైన ఆదరణ సంపాదించుకొని మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించలేని భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా కలెక్షన్ల పరంగా ఈ సినిమా వంద కోట్లను దాటిపోయింది.ఇలా ఈ సినిమా విజయపథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో మరోవైపు కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాపై విష ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరూ ఎలాంటి ప్రచారాలు చేసినా సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్ కి జనాలు వస్తారని ఈ సినిమా నిరూపించింది.

ఇకపోతే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని వీక్షించి ఈ సినిమాలో మహేష్ బాబు ఎనర్జిటిక్ ఫర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు భార్య నమ్రత కూడా థియేటర్ కి వెళ్లి ఒక సాధారణ ప్రేక్షకుడు మాదిరిగా ఈ సినిమాని చూసి ఆనందించారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా గురించి హీరో శర్వానంద్ స్పందించారు.

ఈ క్రమంలో తన ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి వెళ్లిన శర్వానంద్ థియేటర్ లో తన మూడు సంవత్సరాల మేనల్లుడు ఈ సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన అల్లుడికి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమేనని తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా శర్వానంద్ తన అల్లుడు గురించి చెబుతూనే సర్కారీ వారి పాట చిత్ర బృందానికి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం శర్వానంద్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus