పోస్ట్ పోన్ అవుతున్న పడి పడి లేచే మనసు

యువ హీరోల్లో శర్వానంద్ స్టైలే వేరు.. చేసే ప్రతి సినిమా సరికొత్త పంథాలో ఉండాలని కోరుకునే శర్వానంద్ వరుస విజయాలతో దూసుకెళ్లిన శర్వానంద్ సడన్ గా స్లో అయ్యాడు. “రాధ” ఫ్లాప్ అవ్వడం, “మహానుభావుడు” సక్సెస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ మారుతి అకౌంట్ లోనే పడిపోయింది. దాంతో శర్వానంద్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ శర్వానంద్ సరికొత్త సినిమా “పడి పడి లేచే మనసు”పై పడింది. సాయిపల్లవి కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సమయం నుంచి పలు రకాలుగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది.

దాంతో డిసెంబర్ లో విడుదల చేద్దామని ఫిక్స్ అయినప్పటికీ.. షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో సినిమాను ముందు అనుకొన్నట్లుగా డిసెంబర్ లో కాకుండా తనకు బాగా అచ్చొచ్చిన జనవరి లేదా ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.
ఈ సినిమాలో శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా.. ఒక యాక్సిడెంట్ లో ప్రేమించిన ప్రియురాలిని మర్చిపోవడం, ఆమె మళ్ళీ తన ప్రియుడికి తన ప్రేమను వ్యక్తపరిచి తిరిగి అతను తనను ప్రేమించాలే చేసుకోవడం అనేది సినిమా కథాంశం అంటూ ఆల్రెడీ ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దర్శకుడు హను రాఘవపూడి మాత్రం ఈ సినిమా ఒక మంచి ప్రేమకథ అని చెబుతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus