Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

మా ఫేస్‌, పేరును వాడుకొని కొంతమంది సోషల్‌ మీడియాలో మోసాలు చేస్తున్నారని, చేసే అవకాశం ఉందని, తమ గురించి తప్పుగా చెబుతున్నారని, తమ ఫొటోలను అనవసరమైన కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఇటీవల మన సినిమా తారలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఇలాంటి చర్యల విషయంలో మాకు రక్షణ కావాలి అనేది వారి పిటిషన్‌. వీటిపై విచారణ న్యాయస్థానాలు జరిపి తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

Shatrughan Sinha

ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని కోరుతూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను సోషల్‌ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తన ఐకానిక్‌ డైలాగ్‌ ‘ఖామోష్‌’ను కూడా ఎవరూ వాడకుందా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరడం గమనార్హం.

శత్రుఘ్న సిన్హా డైలాగ్‌ డెలివరీకి సినిమాల్లోనే కాదు, బయటక కూడా పెద్ద ఫ్యాన్‌ బేసే ఉంది. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇక శత్రుఘ్న సిన్హా పిటిషన్‌పై విచారణ జరిపిన బొంబాయి హైకోర్టు సిన్హాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆయన సంభాషణా శైలి ప్రత్యేకంగా ఉంటుందని, ‘ఖామోష్‌’ అనే డైలాగ్‌ ఆయన వ్యక్తిత్వంతో ముడిపడి ఉందని న్యాయమూర్తి చెప్పారు. అందుకే ఆయన అనుమతి లేకుండా మాట, ఫొటోలను వాడటాన్ని నిషేధిస్తున్నట్లు తీర్పునిచ్చారు.

అన్ని వెబ్‌సైట్‌లు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో శత్రుఘ్న సిన్హాకు సంబంధించిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 30కి వాయిదా వేసింది. ఒక నటుడి డైలాగ్‌కు ఇలా హక్కులు కల్పించడం అంటే పెద్ద విషయమే.

 అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus