తాప్సీ(Taapsee Pannu) అవకాశం దొరికిన ప్రతిసారి సౌత్ సినిమా మేకర్స్ పై విషం కక్కుతూనే ఉంది. గతంలో తన మొదటి సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆమె సౌత్ సినిమా మేకర్స్ ని టార్గెట్ చేసింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ల అందం అంటే వాళ్ళ ‘బొడ్డు’ పైనే దర్శకుల ఫోకస్ ఉంటుందని,వారికి ఒక రకమైన అబ్సెషన్ ఉంటుందని తాప్సీ కొమెంట్స్ చేసింది.
తన మొదటి సినిమా ‘ఝుమ్మంది నాదం’ షూటింగ్ టైమ్లో దర్శకుడు రాఘవేంద్రరావు తాప్సీ బొడ్డు పై కొబ్బరి కాయ విసిరిన సీన్ గురించి కూడా పరోక్షంగా మాట్లాడింది.”బొడ్డు మీద కొబ్బరి కాయ విసరడంలో ఉన్న గ్లామర్ ఏంటో, అది చూసి అక్కడి జనాలు ఎందుకు ఎంజాయ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు” అంటూ ఎగతాళిగా కామెంట్స్ చేసింది.
చిత్రీకరణ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి ‘ప్యాడెడ్ బ్రాలు’ వేసుకోమని అడగడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించిందని, హీరోయిన్లని కేవలం ఒక వస్తువులా చూస్తారని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌లో క్లీవేజ్ (ఎద అందాలు) చూపిస్తే గ్లామర్ అనుకుంటారు, కానీ సౌత్‌లో మాత్రం కేవలం బొడ్డు చూపిస్తేనే గ్లామర్ అనుకుంటారు…అంటూ తాప్సీ మరిన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది. తాప్సీ కామెంట్స్ పై టాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ గురించి, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ గురించి ఇలా నెగిటివ్ కొమెంట్లు చేయడం సరైన పద్దతి కాదు అంటూ వారు అభిప్రాయపడుతున్నారు.