Ghost: శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ కలెక్షన్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • October 22, 2023 / 12:49 PM IST

శాండిల్ వుడ్ స్టార్ హీరోలలో ఒకరైన శివరాజ్ కుమార్ కు ప్రేక్షకుల్లో ఉన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కేవలం 4 కోట్ల రూపాయలు అని ఆ మొత్తం కూడా గ్రాస్ కలెక్షన్లు అని తెలుస్తోంది.సెకండ్ డే కలెక్షన్లు కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం.

శివరాజ్ కుమార్ (Ghost) ఘోస్ట్ మూవీ కలెక్షన్ల లెక్కలు తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ సినిమా కలెక్షన్లు ఇంత తక్కువా అని నెటిజన్లు అశ్చర్యపోతున్నారు. అయితే ఘోస్ట్ సినిమాకు పోటీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు కర్ణాటకలో విడుదల కావడం వల్లే ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయని సమాచారం అందుతోంది. శివరాజ్ కుమార్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

శివరాజ్ కుమార్ కు మల్టీస్టారర్ సినిమాలలో నటించే ఆఫర్లు ఎక్కువగా వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో మంచు విష్ణు కన్నప్ప మూవీకి శివరాజ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారని తెలుస్తోంది.

శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ పోషించిన సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. శివరాజ్ కుమార్ కు కళ్లు చెదిరే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. శివరాజ్ కుమార్ కు ఇతర భాషల సినిమాలలో భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కుతోందని సమాచారం అందుతోంది. శివరాజ్ కుమార్ రాబోయే రొజుల్లో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. శివరాజ్ కుమార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus