Game Changer: ఒక్క పాట సెట్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన శంకర్…తన మార్క్ చూపించారుగా?

Advertisement

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ఒకరు. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి ఈయన తాజాగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది

దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ సినిమా చేయాలని ముందుగా భావించారు అయితే శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ రెండు వందల నుంచి ఏకంగా 300 కోట్ల దాటిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక శంకర్ సినిమాలోని పాటలకు ఓ ప్రత్యేకత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన పాటల కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు

అలాగే ఈ సినిమాలో (Game Changer) కూడా జరగండి అనే పాట కోసం కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ పాటను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ కనుక చూస్తే చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఈ సాంగ్ షూట్ చేయడం కోసం భారీగానే ఖర్చు చేశారట ఎక్కడ కూడా సెట్ అని ఊహకు అందని విధంగా ప్రతిదీ సహజసిద్ధంగా ఉండడం కోసం ఈయన ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది.

అందుకే ఈ పాటకు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్ వేశారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ఒక్క పాట కోసం 16 కోట్లు ఖర్చు చేయడం అంటే నిజంగానే ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read