ఆ హీరోయిన్ కు రాజమౌళి భారీ షాకిచ్చారా..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతేడాది జులైలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడి ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదలవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ కు చెందిన అలియా భట్ తో పాటు హాలీవుడ్ కు చెందిన ఒలీవియా మోరిస్, నటి శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిడివి ఎక్కువ కావడంతో రాజమౌళి శ్రియ నటించిన సన్నివేశాలను కట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె నటించిన సీన్లు చాలా తక్కువగా ఉంటాయని సమాచారం. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్లీ వరుస ఆఫర్లను పొందాలని శ్రియ భావిస్తున్న తరుణంలో ఆమె నటించిన సీన్లు కట్ అయితే మాత్రం ఆర్ఆర్ఆర్ శ్రియ కెరీర్ కు ఏ విధంగానూ ఉపయోగపడదనే చెప్పాలి. శ్రియ పాత్రకు. సంబంధించిన సన్నివేశాలను కట్ చేస్తే నిర్మాత దానయ్యకు కూడా లక్షల రూపాయలు నష్టమనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమాకు శ్రియకు ఫుల్ రెమ్యునరేషన్ వచ్చినా సీన్లు కట్ చేస్తే మాత్రం ఆ ప్రభావం శ్రియ కెరీర్ పై కూడా పడే అవకాశం ఉంది.

మరోవైపు రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశారని మే నెల నుంచి చరణ్, ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షోను హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus