Devara: దేవర మూవీ బడ్జెట్ గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

  • September 25, 2024 / 05:35 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రిలీజ్ సమయంలో దేవర మూవీ బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. దేవర సినిమా ద్వారా నిర్మాతలకు మరీ భారీ స్థాయిలో లాభాలు అయితే రాలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే వైరల్ వార్తల గురించి నిర్మాతల వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Devara

దేవర సినిమాకు ఖర్చు విషయంలో అయితే రాజీ పడలేదు. అండర్ వాటర్ సీక్వెన్స్ లకు ప్రాధాన్యత ఉండటం, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, రిలీజ్ డేట్ వాయిదా పడటం వల్ల దేవర బడ్జెట్ పెరిగిందని అయితే 350 నుంచి 370 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు ఖర్చు అయ్యి ఉండవచ్చని భోగట్టా. రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలలో దేవర బడ్జెట్ గురించి మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా ఒక నిర్మాత కాగా తమ్ముడి సినిమాకు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని కళ్యాణ్ రామ్ భావించారని భోగట్టా. దేవర సినిమా క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ అని జూనియర్ ఎన్టీఆర్ సైతం క్లైమాక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. క్లైమాక్స్ లో తారక్ పర్ఫామెన్స్ వావ్ అనేలా ఉంటుందని సమాచారం.

దేవర సినిమా సక్సెస్ సాధించడం ఇండస్ట్రీకి కీలకమని చెప్పవచ్చు. దేవర హిందీ వెర్షన్ బుకింగ్స్ మాత్రం పుంజుకోవాల్సి ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని భాషల్లో దేవర సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. కొరటాల శివ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

వరుణ్ తేజ్ లైట్ తీసుకోవడం బెటరేమో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus