Varun Tej: వరుణ్ తేజ్ లైట్ తీసుకోవడం బెటరేమో..!

హిందీ సినిమా ‘కిల్’ ను నార్త్ ఆడియన్స్ కంటే సౌత్ ఆడియన్స్ ఎక్కువగా చూశారు అని చెప్పాలి. తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాకపోయినా.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి మరీ ఒరిజినల్ వెర్షన్(హిందీ) ను వీక్షించారు. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. మరింతగా వీక్షించడం జరిగింది. ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో డిస్కషన్లు కూడా ఎక్కువే జరిగాయి. ఇలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది అని అంతా అభిప్రాయపడ్డారు.

Varun Tej

దీంతో మన టాలీవుడ్ నిర్మాతలు ‘కిల్’ రీమేక్ రైట్స్ కోసం ఎగబడ్డారు. ఫైనల్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఫ్యాన్సీ రేటుకు ‘కిల్’ రీమేక్ రైట్స్ దక్కించుకోవడం జరిగింది. ‘మొదట లారెన్స్ (Lawrence) ఈ రీమేక్ లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’ అంటూ ప్రచారం జరిగింది. కానీ అది వట్టి ప్రచారం మాత్రమే. తెలుగులో ఈ రీమేక్ ను వరుణ్ తేజ్  (Varun Tej) తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఊహించని విధంగా ‘కిల్’ తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో.. రెండు రోజుల క్రితం ‘కిల్’ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది కాబట్టి.. ఇంకా ఎక్కువ మంది తెలుగు వెర్షన్ ను వీక్షిస్తున్నారు. మరి తెలుగు వెర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు.. ఇక రీమేక్ చేస్తే ఉపయోగం ఉంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

గతంలో మోహన్ లాల్ (Mohnlal) ‘లూసిఫర్’ తెలుగులో కూడా అందుబాటులో ఉంటే.. ‘గాడ్ ఫాదర్’ (God Father) ని ఎక్కువ మంది చూడలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్..తోనే సరిపెట్టుకుంది. అంతకు ముందు ‘కాటమరాయుడు’ (Katamarayudu) విషయంలో కూడా ఇదే జరిగింది. సో గట్టిగా మార్పులు చేసి మెప్పిస్తే తప్ప ‘కిల్’ రీమేక్ థియేటర్లలో వర్కౌట్ అవ్వకపోవచ్చు అనే చెప్పాలి.

వాళ్లకు భారీ షాక్ ఇచ్చిన ఆర్కే రోజా.. అలా మాత్రం చేయొద్దంటూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus