ఈ హీరోయిన్లకు బాలీవుడ్ అంటే అంత పిచ్చి ఎందుకో ?

Advertisement

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్న, రాణించడానికి తపిస్తున్న 70% మంది ముంబై బ్యాచే. ఏదో డబ్బు, పేరు కోసం తెలుగులో నటిస్తారు కానీ.. వీళ్ళ ఫైనల్ గోల్ & టార్గెట్ మాత్రం ఎప్పటికీ బాలీవుడ్. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ ల విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఈ ఇద్దరు బాలీవుడ్ భామలు తెలుగులో స్టార్ హీరోయిన్లు. ఇక్కడ వీళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా కోటిన్నర పైనే. ఇక్కడ సెకండ్ హీరోయిన్ రోల్ అంటే కనీసం కథలు కూడా వినరు. కానీ.. బాలీవుడ్ లో సినిమా అంటే మాత్రం ఎలాంటి పాత్ర అయినా, ఎన్నో నెంబర్ హీరోయిన్ అయినా పర్వాలేదు అని పరిగెడుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో “మర్ జావాన్” అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే.. పూజా హెగ్డే కూడా “హౌస్ ఫుల్ 4” సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. బాలీవుడ్ లో తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమా చేయడమే కాక.. ప్రమోషన్స్ లోనూ యాక్టివ్ గా పాల్గొనే ఈ హీరోయిన్లు తెలుగు సినిమాల విషయంలో ఎందుకంత టెక్కు చూపుతారనేది వాళ్ళకే తెలియాలి.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news