‘నీకు ఫ్యాన్సా…?’ అంటూ పూరి కొడుకు పై ట్రోలింగ్..!

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష పూరి.. హీరోగా పరిచయమయ్యి.. తిప్పికొడితే ఓ నాలుగు సినిమాలు కూడా చెయ్యలేదు. పోనీ అవి హిట్ అయ్యాయా అంటే అదీ లేదు. అసలు ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా చాలా మందికి తెలిసి ఉండదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మెన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. ఇక హీరోగా అయితే.. ‘ఆంధ్రాపోరి’ ‘మెహబూబా’ వంటి సినిమాల్లో నటించాడు.వీటి ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం అనిల్ పాదూరి డైరెక్షన్లో ‘రొమాంటిక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా ఇంకా విడుదల కాలేదు.. మరి ఈ యంగ్ హీరోకి ఫ్యాన్స్ ఉంటారా? అంటే ప్రత్యేకించి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది నిన్న ఆకాష్ పూరి.. ‘నా అభిమానులకు విజ్ఞప్తి’ అంటూ ఓ లేఖను విడుదల చేసాడు. ‘కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న తరుణంలో నా పుట్టినరోజున ఎటువంటి వేడుకలు నిర్వహించ వద్దు….నేను కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. అధికారులు, పోలీసులు మరియు ప్రభుత్వ నిబంధనలు మనం పాటించాలి.

అలాగే సామాజిక దూరం కూడా’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతే ఇక నెటిజెన్లకు ఫుల్ స్టఫ్ దొరికింది. ఆకాష్ పూరి పై మీమ్స్ చేస్తూ అతన్ని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ‘చరణ్, ఎన్టీఆర్ వంటి వాళ్ళు తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు లేఖలు విడుదల చేసారు. వాళ్ళు నువ్వు.. ఒకటేనా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఈ టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus