Anasuya Vaccination: పొట్టినిక్కరుతో రంగమ్మత్త వ్యాక్సినేషన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ గ్లామరస్ యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఆమె ఎలాంటి షో చేసినా కూడా గ్లామర్ తోనే షోకి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. జబర్దస్త్ ద్వారా ఎక్కువగా క్రేజ్ అందుకున్నప్పటికి ఆ తరువాత సినిమాల్లో బెస్ట్ యాక్టింగ్ తో కూడా క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా రంగమ్మత్త పాత్రతోనే కెరీర్ మొత్తం సరిపోయేంత క్రెడిట్ ను అందుకుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో షాక్ ఇచ్చే అనసూయ ఈసారి వ్యాక్సినేషన్ వేయించుకునే క్రమంలో కూడా పొట్టి బట్టల్లో కనిపించి షాక్ ఇచ్చింది.

ఆమె భుజానికి వ్యాక్సిన్ ఇస్తుండగా భర్త కూడా పక్కనే ఉన్నాడు. అనసూయ భయపడుతూ అతని చేతులు పట్టుకుంది. అయితే ఇక్కడ కూడా చిన్న నిక్కర్ జీన్స్ లో ఈ యాంకర్ నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. దీంతో ఎప్పటిలానే అనసూయపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ టైమ్ లో కూడా అంత పొట్టి నిక్కరుతో వెళ్లాలా అంటూ కామెంట్స్ చూస్తున్నారు. ఇక అలాంటి కామెంట్స్ కు అనసూయ పెద్దగా స్పందించదని అందరికి తెలిసిందే.

ఒకవేళ స్పందిస్తే మాత్రం అందరికి పవర్ఫుల్ గా కౌంటర్ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న అనసూయ మలయాళం, తమిళ్ భాషలో కూడా మంచి ఆఫర్స్ వస్తే నటించడానికి ఒప్పుకుంటోంది.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus