Tamanna: ‘లస్ట్ స్టోరీస్ 2’ తేడా వస్తే తమన్నా ఓ రేంజ్లో ట్రోల్ అవుతుంది!

బాలీవుడ్లో రూపొందే వెబ్ సిరీస్ లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్లు, బూతులే ప్రధానాంశంగా అక్కడి వెబ్ సిరీస్ లు రూపొందుతాయి. అయితే ఇంటిమేట్ సన్నివేశాలు ఏ రేంజ్లో ఉన్నప్పటికీ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోతే ట్రోలింగ్ తప్పదు. ఇలాంటి విషయం పై తమన్నా ఊహించని విధంగా స్పందించింది. తమన్నా మాట్లాడుతూ.. ” ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనేది ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం. టైటిల్లో ఉన్న లస్ట్.. సిరీస్ లో ఉండదు. కాబట్టి టైటిల్ చూసి మోసపోవద్దు.

ఇందులో బామ్మ, అమ్మ ,వదినతో పాటు పనిమనిషి ప్రేమను కూడా అద్భుతంగా చూపించారు. ఇది చూస్తున్నప్పుడు ‘ఎవరన్నా వస్తున్నారేమో’ అని కంగారు పడకండి. హ్యాపీగా కంటిన్యూ చేయండి. ఏకాంతంగా చూడాలనేమీ లేదు.. ఫ్యామిలీతో కలిసే చూడండి. అలా అందరితో కలిసి చూడటం వల్ల తుఫానేమి రాదు, ఆకాశం ఊడి కింద పడిపోదు, వైఫై కనెక్షన్ ఆగిపోదు, భయపడకుండా ప్రశాంతంగా చూడండి ” అంటూ ఓ వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. అయితే ఇదే సిరీస్ లో నటించిన కాజోల్ మాత్రం ‘ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.

కానీ అవి సాంకేతికంగా చిత్రీకరించినవి’… అంటూ చెప్పుకొచ్చింది. మరి (Tamanna) తమన్నా ఎందుకు ఇలా చెప్పింది అనే డౌట్ అందరిలోనూ ఉంది. టీజర్ చూస్తే.. రొమాంటిక్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. నెట్ ఫ్లిక్స్ నుండి వచ్చే వెబ్ సిరీస్ లు ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉంటాయి, తమన్నా మాటలు విని కనుక ఇది ఫ్యామిలీతో కలిసి చూస్తే.. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ తమన్నా చెప్పినట్టు కాకుండా ఇందులో కనుక డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటే.. ఆమె ఓ రేంజ్లో ట్రోల్ అవ్వడం ఖాయం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus