ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) జరిగిన దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో అసలు అక్కడ నిందితుడి వేలిముద్రలు దొరకలేదు అని చెబుతున్నారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించిన టీమ్.. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ సరిపోలడం లేదని బాలీవుడ్ మీడియాలో రాసుకొచ్చింది. దీంతో అసలేం జరిగింది, ఏంటీ అయోమయం అనే చర్చ మొదలైంది.
ఈ నెల 16న తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు ప్రవేశించి అతనిపై దాడి చేశాడని తొలుత నుండి పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సీసీ టీవీ ఫుటేజీ నుండి నిందితుణ్ని గుర్తించి ఇతర రాష్ట్ర పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం సైఫ్ ఇంటి నుండి సేకరించిన 19 వేలిముద్రల్లో ఏదీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అవ్వడం లేదట.
దీంతో మరోసారి ఘటనా స్థలం నుండి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు నిర్ణయించారట. మరోవైపు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను పోలీసులు ఇప్పటికే సేకరించారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించనున్నారు. దాంతో ఈ కేసు విషయంలో మరికొంత క్లారిటీ వస్తుంది.
నిందితుడి వేలిముద్రలు సైఫ్ ఇంట్లో లేవు అని వార్త బయటకు రావడంతో గతంలో నిందితుడి తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తనయుడు తప్పు చేయలేదని, కావాలని ఈ కేసులో ఇరికించారని ఆయన వాపోయారు. మరిప్పుడు ఏమవుతుందో చూడాలి. అలాగే అసలు అక్కడేం జరిగింది అనేది కూడా తేలాలి. లేదంటే సగటు బాలీవుడ్ కేసుల్లా ఇది కూడా ఓ సైడ్‌కి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి ముంబయి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.