Nandamuri Balakrishna: బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!

2025 కి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాని వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని ఈ అవార్డులకి ఎంపిక చేసినట్టు సమాచారం. సినీ పరిశ్రమకు చెందిన అజిత్ కు (Ajith) పద్మ భూషణ్, సీనియర్ హీరోయిన్ శోభనకి (Shobana) పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణకి (Nandamuri Balakrishna) కూడా పద్మ విభూషణ్ అవార్డు లభించడం విశేషంగా చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకి, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరఫున చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది.

Nandamuri Balakrishna

దీంతో నందమూరి అభిమానులు టిడిపి శ్రేణులు, హిందూపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకి చెందినవారు కూడా బాలయ్యకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా బాలయ్యకి అభినందనలు తెలపడం విశేషంగా చెప్పుకోవాలి. ‘కంగ్రాచ్యులేషన్స్ బాల బాబాయ్. మీకు పద్మ అవార్డు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.

సినీ పరిశ్రమకి, ప్రజలకు మీరు చేసిన, చేస్తున్న సేవలకు గాను మీరు ఈ అవార్డుకు అర్హులు అని చెప్పడానికి గర్వపడుతున్నాం’ అంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.. ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus