Shraddha Kapoor: ఆ సెంటిమెంట్ వల్ల టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్!

బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని ఆ సాంగ్ లో శ్రద్ధా కపూర్ కనిపిస్తారని సమాచారం. గతంలో శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వచ్చాయి.

అయితే శ్రద్ధా కపూర్ సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నట్టు బోగట్టా. ప్రభాస్ స్థాయికి తగిన హీరోయిన్ శ్రద్ధా కపూర్ అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి నటించిన సాహో సినిమా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శ్రద్ధా కపూర్ మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. గతంలో కొన్ని డ్యాన్స్ బేస్డ్ మూవీస్ లో శ్రద్ధా కపూర్ అద్భుతంగా నటించారు. శ్రద్ధా కపూర్ కు ఉన్న డ్యాన్స్ స్కిల్స్ వల్లే ఆమెకు పలు సినిమాల్లో స్పెషల్ రోల్స్ కోసం ఆఫర్లు దక్కుతున్నాయి. సలార్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus