‘బిగ్ బాస్ సీజన్ 6’ కంటెస్టెంట్ మరియు రన్నరప్ అయిన శ్రీహాన్ అందరికీ సుపరిచితమే. నిజానికి ఇతనే విన్నర్ కావాలి.. కానీ అది ‘బిగ్ బాస్’ కదా.. అక్కడ ఏదైనా జరగొచ్చు అని ఇతని ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. అయితే శ్రీహన్ గేమ్ ఆడిన తీరు అందరినీ మెప్పించింది అనేది వాస్తవం.బుల్లితెర ప్రేక్షకులను.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి శ్రీహాన్ ని చేరువయ్యేలా చేసింది. ఆ సంగతి అలా ఉంచితే.. శ్రీహన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది.
అదే ‘ఆవారా జిందగీ’. నిజానికి ఎప్పుడో రూపొందిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే శ్రీహాన్ ‘బిగ్ బాస్’ కి వెళ్ళకముందు చేసిన సినిమా. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ ఈ జూన్ 23న థియేటర్లలో విడుదల కాబోతుంది. మొన్నామధ్య ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఆ ట్రైలర్ మొత్తం చూసుకుంటే .. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు ఎక్కువగానే దట్టించినట్టు స్పష్టమవుతుంది.మరోపక్క ప్రమోషన్లో భాగంగా నిన్న ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం.
ఇందులో (Shrihan) శ్రీహన్ కి మీడియా నుండి కొంచెం ఘాటైన ప్రశ్నలే ఎదురయ్యాయి. మొదట్లో ఓపిగ్గా సమాధానం చెప్పిన శ్రీహాన్.. తర్వాత సహనం కోల్పోయాడు. ఓ రిపోర్టర్.. ‘మీకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటిది.. ఇలాంటి బూతు సినిమాలో నటించి ఇంకా ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి శ్రీహాన్ ‘నాకు ఆఫర్లు లేని టైంలో వచ్చిన సినిమా ఇది. వచ్చిన ఆఫర్ ని పోగొట్టుకొకూడదు అని భావించి ఈ సినిమాలో నటించాను’ అంటూ సమాధానం ఇచ్చాడు.
అయినా రిపోర్టర్ ఆగకుండా.. ‘బూతు సినిమా అని తెలిసి కూడా ఎందుకు నటించారు?’ అంటూ మరో ప్రశ్న వేశాడు. అందుకు శ్రీహాన్… ‘బూతు సినిమా తీశాను అంటున్నారు.. నా దగ్గర మంచి కథ ఉంది.. నిర్మాతని మీరు తీసుకొస్తారా?’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్