ఆల్కహాల్ కి గుడ్ బై చెప్పేశా!

  • December 8, 2020 / 01:34 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శృతిహాసన్ బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడ ఒకట్రెండు అవకాశాలు వచ్చినా.. శృతి సక్సెస్ ని మాత్రమే అందుకోలేకపోయింది. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ జరగడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేసింది. ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవుతోంది. కొన్నాళ్లక్రితం శృతి ఓ షోలో తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని చెప్పింది.

విస్కీ బాగా తాగేదాన్ని అని చెప్పిన శృతి ఆ అలవాటును మానుకున్నానని తెలిపింది. అయితే సడన్‌గా ఆల్కహాల్‌ మానేయటంతో తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్టుగా తెలిపింది. తాజాగా మరోసారి తన అలవాట్ల గురించి మాట్లాడింది. ఇప్పుడు అసలు మందు జోలికి వెళ్లడం లేదని.. ఆల్కహాల్ కి గుడ్ బై చెప్పేశానని తెలిపింది. పూర్తిగా హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నట్లు శృతి చెప్పింది. ఫుడ్ స్టైల్ కూడా మారిపోయిందని.. పూర్తి వెజిటేరియన్ గా మారిపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయం శృతి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

ఫ్యూచర్ లో ఆమె మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘క్రాక్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే జనవరి నుండి ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘లాభం’ అనే సినిమాలో నటిస్తోంది. మొత్తానికి మరోసారి ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus