Shruti Hassan: ఒకప్పుడు అలవాటు ఉండేది..హుందాగ బ్రతుకుతున్నా!: శృతిహాసన్

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కేవలం నటిగా మాత్రమే కాకుండా మంచి సింగర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా శృతిహాసన్ తన ట్విట్టర్ ద్వారా తాజాగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకప్పుడు తాను పూర్తిగా ఆల్కహాల్ తీసుకుంటూ గడిపే దాన్ని కానీ ఇప్పుడు ఆల్కహాల్ కు దూరంగా ఉంటున్నానని కానీ చాలామంది నేను తాగుతానని చెబుతూ నన్ను తక్కువ చేయాలని చూస్తున్నారు అంటూ ఈమె కామెంట్స్ చేశారు.

గత ఎనిమిది సంవత్సరాల క్రితం తాను ఎక్కువగా తాగుడుకు బానిస అయ్యాను కానీ తాగటం వల్ల కలిగే అనర్థాలను గమనించి నేను పూర్తిగా ఆల్కహాల్ మానేశానని శృతిహాసన్ తెలిపారు. ఇలా పార్టీలకు వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి తాగుడుకు బానిస అయ్యాను కానీ ఇప్పుడు అలాంటి స్నేహితులను కూడా దూరం పెట్టానని తాను మందు సిగరెట్ వంటి వాటిని మానేసి చాలా హుందాగా బ్రతుకుతున్నానని ఈమె తెలిపారు.

మద్యం అలవాటు గురించి చెప్పి.. తనను అవమానపరచడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. దేవుడి దయతో ప్రస్తుతం తన జీవితం బాగుంది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇటీవల హాయ్ నాన్న సినిమాలో ఒక చిన్న పాత్రలో (Shruti Hassan) శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే డిసెంబర్ 22వ తేదీ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ ప్రభాస్ కి జోడిగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus