Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు వెయిట్‌ చేశాక.. ఒక్క సినిమాతో సిద్ధు కాస్తా.. స్టార్‌ బాయ్‌ సిద్ధు అయిపోయాడు. ఆ వెంటనే ఆ సినిమాకు సీక్వెల్‌ చేసి హిట్‌ కొట్టి తనకొచ్చిన పేరును సిమెంట్‌ చేసుకున్నాడు. అయితే సిద్ధు గ్రాఫ్‌ అక్కడితో ఆగిపోయింది.. ఇంకా చెప్పాలంటే మళ్లీ కిందకు దిగుతోంది. ఏ సినిమా చేసినా హిట్‌ కొట్టేస్తాడు అనే పేరు నుండి.. ఏం చేసి ఆ సినిమాలు హిట్‌ కొట్టాడు అనే డౌట్‌ వచ్చేలా ఆయన సినిమాల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటికి చెక్‌ పెడదాం అనుకుంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.

Siddu Jonnalagadda

పైన చెప్పిన సిద్ధు ట్రాన్స్‌ఫార్మేషన్‌ సినిమాఉల ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ అని మీకు అర్థమయ్యే ఉంటాయి. ఆ సినిమాలు ఇచ్చిన కిక్‌లో వరుస సినిమాలు అనౌన్స్‌ అయ్యాయి. అయితే ‘జాక్‌’, ‘తెలుసు కదా’ తేడా కొట్టడంతో అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ఫేమ్‌ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు సితార నాగవంశీ. ఈ సినిమా మే నుండి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగానే మరో కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట సిద్ధు.

ఇటీవల సిద్ధను ఓ కొత్త దర్శకుడు కలసి ఓ సోషియో ఫాంటసీ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. రెండు కథలు బాగుండటం, విజయం వచ్చి చాలా కాలం కావడంతో రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని సిద్ధు జొన్నలగడ్డ అనుకుంటున్నాడట. అయితే ఒక సినిమా క్యారెక్టరైజేషన్‌ మరో సినిమాలు చూపించడకుండా యూనిక్‌ ఉండేలా చూసుకోవడం సిద్ధు అలవాటు. మరి రెండు సినిమాలు ఒకే సారి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి.

ఏదైతే ఏముంది సిద్ధు లాంటి హీరో హిట్‌లు లేకుండా ఎక్కువ రోజులు ఉంటే ఇండస్ట్రీకే మంచిది కాదు. కాబట్టి ‘టిల్లు’ జోన్ నుండి బయటకు వచ్చి ఓ మంచి సినిమా చేయాలి.

రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus