Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

ఓ సినిమా హిట్ అయ్యింది అంటే… ఆ సక్సెస్ క్రెడిట్ అందరికీ చెందుతుంది. అయితే హీరోకి ఎక్కువ  పేరొచ్చినట్టు కొంతమంది చెప్పుకుంటారు. హీరో, దర్శకుడు తీసిన నెక్స్ట్ సినిమాలు కనుక అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోతే.. సోషల్ మీడియాలో నడిచే డిస్కషన్స్ ఎలా ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్'(Toxic) విషయంలో కూడా అలాంటి డిస్కషన్స్ మొదలయ్యాయి. కె జి ఎఫ్ , కె జి ఎఫ్ 2 సినిమాల తర్వాత యష్ నటించిన పాన్ ఇండియా సినిమా ఇది.

Toxic

రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి టీజర్, ట్రైలర్ ఆ రేంజ్లో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఆ హైప్ కి కారణం అంటే యష్ అనే చెప్పాలి. అవును యష్ పేరుపైనే టాక్సిక్ సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. దాంతో మొదటి వీకెండ్ యావరేజ్ నంబర్స్ రిజిస్టర్ కనిపిస్తాయి. వీక్ డేస్ లో ఈ సినిమా నిలబడే అవకాశాలు లేవు. ఎందుకంటే వీకెండ్ లోనే డ్రాప్ పర్సంటేజ్ హెవీగా ఉంది. హిందీలో తప్ప
సో భారీ నష్టాలు తప్పవు. రూ.250 కోట్ల వరకు నిర్మాతకి నష్టం రావొచ్చనేది ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో సోషల్ మీడియాలో యష్ పై కాస్త గట్టిగానే ట్రోలింగ్ జరుగుతుంది. అతని పాన్ ఇండియా ఇమేజ్ అనేది ప్రశాంత్ నీల్ ఇచ్చిన లాటరీ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఆ కామెంట్స్ సరైనవి కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. చిరంజీవికి ఖైదీ , రజినీకాంత్ కి భాషా, మహేష్ బాబుకి పోకిరి, ప్రభాస్ కి బాహుబలి.
ఇలా ఏదైనా కావచ్చు. ఆ సినిమాలు హీరోలు ఓకే చేయబట్టే కదా వాళ్ళకి వెళ్ళాయి. కాబట్టి సక్సెస్ తో హీరోల స్థాయిని తగ్గించకూడదు. టాక్సిక్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి అంటే యష్ వల్లనే. కే జి ఎఫ్ సినిమా సక్సెస్ ను యష్ తలకెక్కించుకుని ఉంటే.. ఈ 4 ఏళ్లు టాక్సిక్ పైనే ఉండేవాడు కాదు. అలాగే రామాయణ్ వంటి సినిమాలో కూడా రావణాసురుడు పాత్ర చేసేవాడు కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా విషయంలో కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
కానీ ఆ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత వచ్చిన సలార్, కల్కి .. సినిమాలతో ఆ ట్రోల్స్ ను తిప్పికొట్టాడు. సో యష్ కూడా నెక్స్ట్ సినిమాలతో ఈ ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus