దక్షిణాది సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చిన్మయి శ్రీ పాద ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశిస్తూ వారిని కించపరిచేలా మాట్లాడితే మాత్రం ఈమె తన గలం విప్పుతారు. ఈ విధంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని నింపుతూ సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవ్వడమే కాకుండా ఈమెను కూడా తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో కూడా చిన్మయి చాలా సంతోషంగా గడుపుతున్నారనే విషయం మనకు తెలిసిందే. ఈమె 2014వ సంవత్సరంలో నటుడు రాహుల్ రవీందర్ ను వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత చిన్మయి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక వీరిద్దరి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకు ఈ దంపతులు పండంటి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
ఈ క్రమంలోనే చిన్మయి తన పిల్లల ఫోటోలను షేర్ చేయడంతో అసలు ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించకుండా పిల్లల గురించి చెప్పడంతో ఈమె కూడా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు అంటూ విమర్శలు వచ్చాయి అయితే ఈ విమర్శలను తిప్పికొడుతూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా తన పిల్లల ఫేస్ రివిల్ చేయలేదు ఇలా పిల్లల ఫోటోలను రహస్యంగా ఉంచినటువంటి ఈమె తాజాగా తన పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి చిన్మయి ఇదొక గొప్ప ఆశీర్వాదం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.అయితే తమ ఇద్దరు చిన్నారులు ఒక ఏడాది పూర్తి చేసుకొని రెండవ ఏటా అడుగు పెట్టిన సందర్భంగా ఈమె తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్