శ్రీవిష్ణు హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ ‘నేనే నా’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘సింగిల్'(Single). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
2025 మే 9న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ… వెన్నెల కిషోర్, శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అవ్వడం.. సమ్మర్ హాలిడేస్ వంటివి కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 4.51 cr |
| సీడెడ్ | 0.93 cr |
| ఉత్తరాంధ్ర | 1.10 cr |
| ఈస్ట్ | 0.45 cr |
| వెస్ట్ | 0.32 cr |
| గుంటూరు | 0.65 cr |
| కృష్ణా | 0.70 cr |
| నెల్లూరు | 0.30 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.96 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.42 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 11.38 cr(షేర్) |
‘సింగిల్’ సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.11.38 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.25 కోట్ల వరకు కొల్లగొట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.4.78 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమా బాక్సాఫీస్ రన్ కి కలిసొచ్చాయి ని చెప్పాలి.