నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Advertisement

నటుడి కానీ, సాంకేతిక నిపుణుడి కానీ.. అవార్డు అనేది చాలా గొప్పది. పురస్కారం ఇచ్చే ప్రోత్సాహం ఏదీ ఇవ్వదు అంటారు. అందుకే మన సినిమా జనాలు అవార్డులను చాలా గొప్పగా చూస్తుంటారు. తెలుగు సినిమాకు సంబంధించి మొన్నీ మధ్య వరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నంది అవార్డులు మాత్రమే ఉండేవి. గత దశాబ్దానికిపైగా ఈ అవార్డులు ఇవ్వడం లేదనుకోండి. త్వరలో ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తామని చెబుతోంది. ఇక తెలంగాణలో అయితే ‘గద్దర్‌’ అవార్డులు అంటూ ఇటీవల ప్రకటించారు.

Vamsi Nandipati

ఇప్పుడు ఈ అవార్డుల గురించి ఎందుకు అనుకుంటున్నారా? నంది అవార్డులను ఓ యువ నిర్మాత పందులతో పోల్చారు. ఆయన ఉద్దేశం ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన, ఎంతో గౌరవం ఉన్న, ఎంతో మంది ప్రముఖ నటులు ఆ అవార్డులను ఎంతో గౌరవంగా తమ ఇళ్లలో పెట్టుకున్న నంది అవార్డును పందితో పోల్చడం ఏ మాత్రం సమంజసం కాదు. ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ సినిమా రిలీజ్‌ నిర్మాత వంశీ నందిపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సీనియర్‌ నటి లయ గొప్పతనం గురించి చెబుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘అప్పట్లో ఆవిడ నందులను పందుల్లా పెంచారు’ అంటూ వంశీ నందిపాటి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అలా ఫ్లోలో వెళ్లిపోయుండేది.. కానీ ‘నంది’పాటి మరోసారి ఆ విషయం గురించి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేశారు. అప్పట్లో లయ పందులను పెంచుకున్నట్టు నంది అవార్డులు సాధించారనే ఉద్దేశంలో అన్నానని అన్నారు.

అయితే ఆయన చెప్పినట్లుగా లయకు ఏమన్ని ఎక్కువ అవార్డులు వచ్చేయలేదు. లయకు నంది అవార్డు వచ్చింది మూడుసార్లే. ‘స్వయంవరం’ సినిమాకు స్పెషల్ జ్యురీ, ‘ప్రేమించు’, ‘మనోహరం’ సినిమాలకు ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. ఆ మాత్రం దానికి పందుల కామెంట్లు అవసరమా అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో అనవసరంగా వంశీ ‘నంది’పాటి లేనిపోని డిస్కషన్లకు కారణమవుతున్నారు అనిపిస్తోంది.

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus