Siva Karthikeyan: రజనీ సినిమా సెట్‌… డైరక్టర్‌ని ఓ ఆటాడుకున్న స్టార్‌ హీరో… వీడియో వైరల్‌

మీరు ఇండియన్‌ క్రికెట్‌ని, క్రికెట్‌ రిలేటెడ్‌ వైరల్‌ న్యూస్‌ని కూడా ఫాలో అయ్యేవారైతే.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ విషయం ఇప్పుడు చెన్నైలో జరిగింది. ఆ మధ్య న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ జరుగుతున్నప్పుడు కొచ్చిలో మ్యాచ్‌కి టీమ్‌ ఇండియా అంతా వచ్చినప్పుడు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో సంజు శాంసన్‌ గురించి టీమ్‌ ఇండియా కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ ఆటపట్టించాడు. అన్న వస్తున్నాడు డిస్ట్రబ్‌ చేయొద్దు అంటూ సరదాగా కవ్వించాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఎవరూ డిస్ట్రబ్‌ చేయొద్దు అంటూ చుట్టూ ఉన్నవారిని పక్కకు వెళ్లమంటూ హడావుడి చేశాడు.

Siva Karthikeyan

ఇప్పుడు అదే సీన్‌ చెన్నైలో రిపీట్‌ అయింది. ఇక్కడ దర్శకుడు సిబి చక్రవర్తి సంజు శాంసన్‌ ప్లేస్‌లో ఉంటే.. సూర్య కుమార్‌ యాదవ్‌ బదులు హీరో శివకార్తికేయన్‌ ఉన్నాడు. సేమ్‌ టు సేమ్‌ అన్నట్లుగా ‘తాయ్‌ కిళవి’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ హంగామా జరిగింది. ఆ ఈవెంట్‌కి సిబి వస్తుండగా ఆ సినిమా నిర్మాత అయిన శివకార్తికేయన్‌ సరదాగా తలైవాతో సినిమా చేస్తున్న దర్శకుడు వస్తున్నారు.. పక్కకు జరగండి అంటూ ఆటపట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అంతేకాదు ఆ వేదిక మీద శివకార్తికేయన్‌ మాట్లాడుతూ తమ బ్యానర్‌ ప్యాషన్‌ స్టూడియోస్‌లో సినిమా చేద్దాం అని సిబి చక్రవర్తిని అడిగితే.. అతను రజనీకాంత్‌ సినిమాకు వెళ్లిపోయాడు అంటూ సరదాగా ఆటపట్టించాడు. ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు. సిబి అయితే నవ్వాపుకోలేకపోయాడు. శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో సీనియర్‌ నటి రాధిక ప్రధానపాత్రలో నటించిన ‘తాయ్‌ కిళవి’ ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది.

సిబి చక్రవర్తి, శివకార్తికేయన్‌ కలసి గతంలో ‘డాన్‌’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే ఇప్పుడిలా ఆటపట్టించాడు.

 విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags