టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాతల్లాంటి వాళ్లు కొంతమంది చెప్పే మాటలు, చేసే యాక్షన్లు, వేసుకునే చొక్కాల మీద పేర్లు చూస్తుంటే.. వీళ్లు కావాలనే ఇలా చేస్తున్నారా? అని అనిపిస్తుంది. గతంలో చాలామంది సినిమా జనాలు ఇలాంటి పనులు చేసి.. నెటిజన్లతో అక్షింతలు వేయించుకున్నారు. ముద్దు పేర్లు పెట్టించుకుని కాస్త బాధపడినా బయటకు నవ్వేసి ముందుకు సాగిపోయారు కూడా. ఇప్పుడు ఆ కోవలోకి యువ నిర్మాత ఎస్‌కేఎన్ (Sreenivas Kumar Naidu) అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రీసెంట్‌గా జరిగిన ‘ది రాజా సాబ్’ (The Rajasaab) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాటలు, వేసిన టీ షర్ట్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
ప్రభాస్ (Prabhas)– మారుతి (Maruthi) కాంబినేషన్‌లో చాలా నెలలుగా రూపొందుతూనే ఉన్న ‘ది రాజా సాబ్’ (The Rajasaab) సినిమా టీమ్ ఇటీవల సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. మామూలుగా అయితే సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందో, 45 రోజుల ముందో టీజర్‌ను రిలీజ్ చేస్తుంటారు. కానీ ‘రాజాసాబ్’ (The Rajasaab) టీమ్ సుమారు ఆరు నెలల ముందే రిలీజ్ చేసింది. ఎందుకు ఏంటి అనేది టీమే చెప్పాలి. అయితే పోస్టర్ మీద ఓటీటీ పార్టనర్ లోగో ఇంకా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ ఈవెంట్‌కి దర్శకుడు మారుతి (Maruthi) మిత్రుడు నిర్మాత ఎస్‌కేఎన్ (Sreenivas Kumar Naidu) వచ్చారు.
ఆయన మాటల్లో ఎవరో నిర్మాత ఈ సినిమాను తొక్కేయాలని చూశారు అనే విమర్శ ఎంతగా ఐబాల్స్ గ్రాబ్ చేసిందో తెలియదు కానీ.. ఆయన టీ షర్ట్ అందరి దృష్టిలో పడింది. దానికి కారణం ఆ టీ షర్ట్ మీద ‘జాతిని..’ అనే పదం రాసుకొచ్చారు. చివర ఓ మంట సింబల్ పెట్టారు. ఆ రెండూ కలిపితే ఏదో అర్థం ఉందని.. అది ‘రాజాసాబ్’ సినిమా చూస్తే తెలుస్తుంది అని ఎస్‌కేఎన్ (Sreenivas Kumar Naidu) సన్నిహితులు అంటున్నారు. అయితే ఇలా సగం రాసుకొచ్చి.. ఎందుకు మనోభావాల వరకు వెళ్లడం అనేది నెటిజన్ల మాట.
అక్కడితో ఆయన ‘అతి’ ఆగలేదు. దర్శకుడు మారుతి (Maruthi) కి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ.. ‘భార్యలకు మాత్రమే భర్త మగతనం తెలుస్తుందని, అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్‌గా ఉండే బెస్ట్ ఫ్రెండ్‌కి తెలుస్తుంది. అలా తనకు 20 ఏళ్లుగా మారుతి (Maruthi) పరిచయం అని. అతని సంగతి నాకు తెలుసు అని అన్నాడు. ఆ తర్వాత టీ షర్ట్ మీదున్న ‘జాతిని’ పదాన్ని సింబాలిక్‌గా చూపించారు. ఇదంతా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎస్‌కేఎన్ (Sreenivas Kumar Naidu) ఇలా ఎందుకు చేశారు, ఇంటెన్షన్ ఏంటి అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.
సినిమా ఎనౌన్స్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ చేసాడు..
ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ టీజర్ చూశాక పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/bsXkV9ZVN1
— Filmy Focus (@FilmyFocus) June 16, 2025
మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది..
మారుతి పొటెన్షియల్ ఏంటి అనేది క్లోజ్ ఫ్రెండ్ గా నాకు తెలుస్తుంది#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/Wup51EQ9MV
— Filmy Focus (@FilmyFocus) June 16, 2025