ఇప్పుడు ఆ పాప ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యిందో తెలిస్తే షాక్ అవుతారు..?

కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న చిన్నపిల్ల లాగ కనిపించిన వీళ్ళు అకస్మాత్తుగా ఇంత ఎత్తుకి ఎలా ఎదిగిపోయారు. హీరోయిన్ రేంజ్ కి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉంటాము. అలా ఎంతోమంది విషయం లో జరిగింది. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం లో ఒక చైల్డ్ ఆర్టిస్టు ప్రణవి గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము.

2016 వ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో ఈ చిత్రం తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆరోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమానే నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా కొనసాగుతుంది.

ఇకపోతే ఈ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా చాలా మంది ఉంటారు. వారిలో ప్రణవి అనే అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది . పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కుమార్ హీరో గా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే చిత్రం విడుదలైంది, ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రణవి నే నటించింది. ఈమధ్య కాలం లో ప్రొమోషన్స్ లో ఈ అమ్మాయి చాలా చురుగ్గా పాల్గొనగా ఈ విషయం తెలిసింది.

గత వారం స్టార్ మా ఛానల్ లో అక్కినేని నాగార్జున గెస్ట్ గా వచ్చిన ఒక షో కి తమ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పాల్గొన్నది ప్రణవి. అప్పుడు నాగార్జున ఈమెని చూసి, ఈమె నా (Soggade Chinni Nayana) ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటించింది. అప్పుడు చాలా చిన్న అమ్మాయి, ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది అని చెప్పుకొచ్చాడు. కేవలం ఈ సినిమాలో మాత్రమే కాదు, గతం లో ఆమె చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది .

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus