రజనీ కుమార్తెతో కబాలి నిర్మాత

Advertisement

తమిళనాట అగ్ర్ర నిర్మాతలలో కలైపులి ఎస్ థాను ఒకరు. ‘తుపాకీ’, ‘కబాలి’, ‘థెరి’ వంటి సినిమాలతో విజయాలు అందుకున్న ఈ నిర్మాత రజనీ కుమార్తె సౌందర్య దర్శకురాలిగా ఓ సినిమా చేయనున్నారు. గతంలో బాబా, పందెంకోడి వంటి సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసిన సౌందర్య తండ్రి రజనీకాంత్, దీపికా పదుకొణె తారాగణంగా తెరకెక్కిన ‘కొచ్చడయాన్’ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. తాజగా రెండోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు సౌందర్య.

పూర్తిగా కొత్తవాళ్ళతోనే రూపొందనున్న ఈ సినిమాకి థాను నిర్మాతగా వ్యవహరించనున్నారు. సౌందర్య తొలి సినిమా ఘోర పరాజయంగా నిలిచినప్పటికీ ఈ కథపై నమ్మకంతో థాను పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారట. సౌందర్య ‘గోవా’ అనే ఓ సినిమాని నిర్మించింది. ఆ అనుభవం కూడా పనికొస్తుందని థాను మారు మాటాడలేదట. ప్రస్తుతం తనయుడు కళాప్రభు దర్శకుడిగా ‘ఇంద్రజిత్’ సినిమా చేస్తున్న థాను తెలుగులో మహేశ్ హీరో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus