సౌత్ ఇండియాలో సినిమాకి, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. సిల్వర్ స్క్రీన్‌పై తమ యాక్టింగ్‌తో మ్యాజిక్ చేసిన ఎంతోమంది నటీనటులు(South Actors).. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి రియల్ లైఫ్ లీడర్లుగా మారారు.
తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఓటు బ్యాంకుగా మార్చుకుని ఏకంగా ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కీలక పదవులు చేపట్టి హిస్టరీ క్రియేట్ చేశారు.
ఆ విధంగా కెమెరా ముందు నుంచి ప్రజా దర్బార్‌లోకి అడుగుపెట్టి, పాలిటిక్స్‌లో పవర్ ఫుల్ పొజిషన్స్‌కు చేరుకున్న సౌత్ ఇండియా యాక్టర్స్ లిస్ట్ చాలానే ఉంది.ఈ జాబితాలో ముందుగా మాట్లాడుకోవాల్సిన లెజెండ్స్.. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత.ఇంకా ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :
1)ఎన్టీఆర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.రామారావు.. రికార్డ్ స్థాయిలో మూడుసార్లు (1983–1984, 1984–1989, 1994–1995) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
2)ఎం.జి.ఆర్ : తమిళనాడులో ఎం.జి.రామచంద్రన్ అన్నాడీఎంకే (AIADMK) పార్టీ తరపున పదేళ్ల పాటు (1977–1987) సీఎంగా సత్తా చాటారు.
3) జయలలిత : ఎం.జి.ఆర్ అనంతరం అలనాటి హీరోయిన్ జయలలిత సైతం అదే పార్టీ నుంచి నాలుగు దఫాలుగా (1991–1996, 2002–2006, 2011–2014, 2015–2016) ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు పాలిటిక్స్‌ను శాసించారు.
4) పవన్ కళ్యాణ్ : నేటి తరం పొలిటికల్ సెన్సేషన్స్ విషయానికొస్తే.. జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ఏకంగా డిప్యూటీ సీఎంగా (2024 నుంచి ప్రస్తుతం) బాధ్యతలు చేపట్టారు.
5) ఉదయనిధి స్టాలిన్ : తమిళనాడులో డీఎంకే (DMK) పార్టీ నుంచి ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా (2021 నుంచి), మంత్రిగా (2022-2026) పనిచేసి.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా (2024 – 2026) పవర్ చూపిస్తున్నారు.
6) దళపతి విజయ్ : ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి, 2026 ఎన్నికల్లో 107 స్థానాలతో సంచలన విజయం సాధించి.. తమిళనాడు నెక్స్ట్ సీఎంగా పీఠాన్ని దక్కించుకోబోతున్నారు విజయ్.
7) కమల్ హాసన్ : ‘మక్కల్ నీది మయ్యం’ (MNM) పార్టీని స్థాపించిన లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గతేడాది నుండి (2025–ప్రస్తుతం) రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
8) చిరంజీవి : ‘ప్రజారాజ్యం’ పార్టీతో పాలిటిక్స్‌లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎంపీగా (2012–2018), కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా (2012–2014) పనిచేశారు.
9) కృష్ణంరాజు: బీజేపీ నుంచి ఎంపీగా (1998–2004) గెలిచి, కేంద్ర మంత్రిగా (2000–2004) బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణం రాజు.
10) సురేష్ గోపి : మలయాళ స్టార్ సురేష్ గోపి కూడా బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీగా (2016–2022) పనిచేసి, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా (2024 నుంచి) కొనసాగుతున్నారు.
11)నందమూరి బాలకృష్ణ : హిందూపూర్లో ముచ్చటగా మూడోసారి (2014 నుంచి ప్రస్తుతం) గెలిచి టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు బాలయ్య.
12)నందమూరి హరికృష్ణ: 2008–2013 టైమ్లో హరికృష్ణ కూడా రాజ్యసభ మెంబర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
13)మోహన్ బాబు: 1995–2000 టైమ్లో టీడీపీ తరపున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు మోహన్ బాబు.
14)విజయశాంతి : కాంగ్రెస్ నుంచి మెదక్ ఎంపీగా (2009–2014) గెలుపొందారు.
15)రోజా: వైసీపీ తరపున పదేళ్లు (2014–2024) ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా (2022–2024) పనిచేశారు రోజా.
16)బాబు మోహన్ : వివిధ పార్టీల నుండి (TDP, TRS, BJP) రెండుసార్లు (1998–2004, 2014–2018) ఎమ్మెల్యేగా గెలిచారు.
17) విజయ్ కాంత్ : డీఎండీకే పార్టీ పెట్టిన కెప్టెన్ విజయకాంత్ వరుసగా పదేళ్లు (2006–2016) ఎమ్మెల్యేగా గెలిచి, ప్రతిపక్ష నేత స్థాయికి (2011–2016) ఎదిగారు.
18) శరత్ కుమార్ : ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీ పెట్టిన సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా రాజ్యసభ ఎంపీగా (2001–2006), ఎమ్మెల్యేగా (2011–2016) సేవలు అందించారు.