Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Advertisement

సినిమా తెరకెక్కించే సాంకేతిక రోజుకు రోజుకు అప్‌గ్రేడ్‌ అవుతోంది. కొత్త సినిమా వచ్చినప్పుడు అందులో వాడిన టెక్నాలజీ ఏంటి అనే చూసే ప్రేక్షకులు కూడా పెరిగారు. అందుకు తగ్గట్టే సినిమా నిర్మాణ సంస్థలు ఆ సినిమా గురించి, వారు ఇస్తున్న ఫార్మాట్ల గురించి ఇంకా గొప్పగా చెబుతున్నారు. అయితే అంతటి టెక్నాలజీతో రూపొందుతున్న సినిమాలు ఎక్కడో విదేశాల్లో సరికొత్త స్క్రీన్లలో మాత్రమే పడుతున్నాయి. దీంతో మన వారికి కాస్త నిరాశే ఎదురవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సినిమా చూపించే టెక్నాలజీ మన దగ్గర కూడా డెవలప్‌ అవుతోంది.

Imax – Dollby – 70 MM

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అంటే ఐమ్యాక్స్‌. పదేళ్ల తర్వాత ఐమ్యాక్స్‌ అనుభూతిని తెలుగు ప్రేక్షకులు తిరిగి పొందే అవకాశం త్వరలో రానుంది. హైదరాబాద్‌లో ‘సుదర్శన్‌ 70 ఎంఎం’లో ‘ఏఎంబీ క్లాసిక్‌ విక్టరీ’ పేరుతో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయానికి హాలీవుడ్ సినిమా ‘ది అడెస్సీ’ ఓ వీడియోను సిద్ధం చేసి విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఒడిస్సీ’. ఈ సినిమా జులై 17న థియేటర్లలోకి రానుంది. ఆ మూవీని ఐమ్యాక్స్‌ 70ఎంఎం, ఐమ్యాక్స్‌, 70ఎంఎం, 35 ఎంఎం, డాల్బీ విజన్‌, లార్జ్‌ ఫార్మాట్‌లో ఇలా కనిపిస్తోంది అంటూ వారి వెబ్‌సైట్‌/ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను సిద్ధం చేశారు. అలాగే ఓ ఔత్సాహికుడు మహేష్‌ బాబు – రాజమౌళి సినిమా ‘వారణాసి’ కొన్ని ముఖ్యమైన ఫార్మాట్లలో ఎలా కనిపిస్తుందో ఓ వెబ్‌సైట్‌ రూపొందించారు. అవే ఇవీ.

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus